Friday, August 1, 2008

ఈనాడు చంద్రశేఖర్ అక్రమార్జన

ప్రస్తుత పరిస్థితుల్లో అవినీతికి పలానా పత్రిక రిపోర్టరని లేదు. యాజమాన్యం ఎంత కఠినంగా ఉన్నా వాటిల్లో పనిచేస్తూ సంపాదించడం మొదలుపెట్టిన వాడు తన నైజాన్ని మార్చుకోలేడనడానికి ఈనాడు చంద్రశేఖరే నిదర్శనం. డాబాగార్డెన్స్ డేట్ లైన్ పై వార్తలు రాసుకుని నెలకు వెయ్యో, పదిహేను వందలో సంపాదించుకునే వాడు ఉన్నట్టుండి లక్షలు ఎలా ఆర్జించాడన్నదాని గురించి యాజమాన్యం ఎందుకు ఆరా తీయడం లేదన్నది పక్కన పెడితే, విశాఖలో ఇటీవల వీడి ఆగడాలకు హద్దులేకుండాపోయింది. గత కొద్ది మాసాల నుండి కార్పోరేషన్ బీటు కూడా వెలగబెడుతున్న బినామీ సంపాదన (బి.ఎస్.) చంద్రశేఖర్ రెండు పెద్ద కేసుల్లో జి.వి.ఎం.సి. సిటీ ప్లానర్ రఘును ఇరికించే ప్రయత్నం కూడా చేశాడు. చివరికి విషయం మిగతా విలేఖరులకూ పొక్కడంతో అనుకున్న "ఫిగర్" తగ్గి వుండవచ్చుగానీ, ఆ రెండు కేసుల్లోనూ వీడి సంపాదన మూడు లక్షల రూపాయలంటే నమ్మశక్యం కాదు. తొక్కలో కెమేరా ఒకటి మొలలో పెట్టుకుని తనో కలం పోటుగాడిలా విర్రవీగిపోయే చంద్రశేఖర్ హవా జి.వి.ఎం.సి.లో బాగానే పనిచేస్తుంది. ఇ.ఇ.ల నుండి నెల మామూళ్లే కాకుండా టౌన్ ప్లానింగ్ విభాగం నుండి కేసుల వారీ ముడుపులు అందుకునే బి.ఎస్. గాడి బాగోతం ఈమధ్య ఈనాడు కాంపౌండ్లో కూడా చర్చనీయాంశంగా మారింది. గతంలో సీతంపేట డేట్ లైన్ పై రాస్తూ కార్పోరేషన్ బీటు చూసి అక్రమార్జనలో యాజమాన్యానికి పట్టుబడి పని పోగొట్టుకున్న ప్రసాద్ కన్నా దారుణంగా తయారైన బి.ఎస్.పై అవినీతి ఆరోపణలు ఇన్నీ అన్నీ కావు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వాహకునిగా, మతప్రచారకుడుకె.ఎ.పాల్ ప్రెస్ మీట్ లలో డబ్బులు పంపిణీ చేసే మధ్యవర్తిగా, కార్పొరేషన్లో సెటిల్మెంట్లు చేసే బ్రోకర్ గా వీడు అనేక పాత్రల్లో జీవిస్తున్నా ఈనాడు స్ఠానిక నిర్వాహకులు పట్టించుకోకపోవడం కూడా పలు సందేహాలకు తావిస్తోంది. వీడు డెస్క్ లో వాళ్లని మేనేజ్ చేస్తున్నట్టు బయట ప్రచారం కూడా జరుగుతోంది. నిప్పులేనిదే పొగరాదన్నట్టు ఈ ప్రచారంలో ఎంతోకొంత నిజం లేకుండా పోదుకదా? సాంస్కృతిక కార్యక్రమాల నిర్వాహకుని హోదాలో వీడు అమ్మాయిలను తన సొంత అవసరాలకు వాడుకుంటుంటాడని వీడి వ్యతిరేక వర్గం చెబుతుంటుంది.
(వీడి అక్రమార్జనపై సమగ్ర ఆధారాలతో కూడిన వ్యాసం కోసం తరువాయి అప్ డేట్ కోసం వేచి చూడండి. అదే విధంగా వీడి గురించి గాని, వీడిలాంటి బ్రోకర్ జర్నలిస్టుల గురించి గానీ మీకు తెలిసిన వివరాలను మా ఇ-మెయిల్ కు పంపడం గాని, లేదా ఐటం కింద కామెంట్ రూపంలో జోడించడం గానీ చేయడం మరవకండి.)

1 comment:

nigha netram said...

ఈనాడు చంద్రశేఖర్ 'స్మైల్ ప్లీజ్ ' అనే మాసపత్రికను నడుపుతున్నాడు. చందు పేరుతో ఎడిటోరియల్ కూడా రాస్తుంటాడు.ఎక్కడా వేసిన వెంచర్లు కనవడని బోగస్ సంస్థ "వెల్ఫేర్" దీనికి బేక్ బోన్. ఈనాడును అడ్డుపెట్టుకుని "వెల్ఫేర్"ని బ్లాక్ మెయిల్ చేసి ఇప్పటికే లక్షలు వసూలు చేసాడు.