Monday, July 28, 2008

"చిరు" పార్టీ టిక్కెట్ కోసం శివశంకర్ దరఖాస్తు!

ఒకప్పటి జర్నలిస్టు... ఇప్పటి యాక్టివిస్టూ అయిన విశాఖపట్నానికి చెందిన ఎస్.ఎస్.శివశంకర్ చిరంజీవి పార్టీ టిక్కెట్టు కోసం దరఖాస్తు చేశారు. గత ఎన్నికల నుంచే ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నశివశంకర్ కె.ఎ.పాల్ తో చేతులు కలిపి అతనికి మీడియా సహకరించేలా చేస్తూ ఆర్జిస్తున్న సొమ్మును ఖర్చుపెట్టడానికి సిద్ధమైన శివశంకర్ పై ప్రత్యేక కథనం.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

జర్నలిజం ముసుగులో విశాఖలో...

జర్నలిజం ముసుగులో విశాఖలో కొంతమంది వ్యక్తులు సాగిస్తున్న చీకటి వ్యవహారాలపై పోలీసులు నిఘా వేశారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉత్తరాంధ్రలో నకిలీ జర్నలిస్టులు

ఏ పత్రికలోనూ పని చేయకుండా జర్నలిస్టులగా చలామణీ అవుతూ అక్రమార్జనకు పాల్పడుతున్న నకిలీల సంఖ్య ఇప్పుడు ఉత్తరాంధ్ర జిల్లాలలోనూ పెరుగుతోంది. "ఆపరేషన్ గజ" అంటూ ఇక్కడి అసలైన జర్నలిస్టులు ముద్దుగా పిలుచుకునే నకిలీలపై ప్రత్యేక కథనం...
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

విశాఖలో "దీన"పత్రికల హోరు!

పత్రికా ప్రచురణ రంగంలో హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద ప్రచురణ కేంద్రంగా విరాజిల్లుతూ వస్తున్న విశాఖలో ఇప్పుడు "దీన"పత్రికల హోరు మొదలయింది. ఇంత వరకూ వార పత్రికగానో, పక్షపత్రిక గానో లేక మాస పత్రిక గానో ప్రచురితమవుతున్న పత్రికలన్నీ దినపత్రికల అవతారం ఎత్తుతున్నాయి. ఇప్పుడు ఉన్న పిరియాడిసిటీనే సక్రమంగా కొనసాగించలేక, యాడ్ వచ్చినప్పుడో లేక మరేదో ఆదాయం వచ్చినప్పుడో అరాకొరాగా చాలీచాలని పేజీలు వేస్తూ నెట్టుకు వస్తున్న వారంతా తమ పత్రికలను ఉన్నట్టుండి డైలీలుగా ఎందుకు మారుస్తున్నారో ఇప్పటికే మీకు అర్ధమై ఉండాలి.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి।

Sunday, July 27, 2008

వి.జె.ఎఫ్. నిధుల గోల్ మాల్!

విశాఖపట్నం: జర్నలిస్టుల సంక్షేమం పేరిట ఏర్పాటైన వైజాగ్ జర్నలిస్టుల ఫోరం (వి।జె.ఎఫ్.) క్రమేణా తన లక్ష్యానికి భిన్నంగా పనిచేస్తోంది. తన బాధ్యతలను ట్రేడ్ యూనియన్లు హైజాక్ చేసుకుపోతుంటే మిన్నకుండిపోవడమే కాకుండా క్లబ్బుకి వస్తున్న ఆదాయాన్ని కైంకర్యం చేసే సంస్క్రుతిని పరోక్షంగా ప్రోత్సహిస్తోంది. గతంలో కమిటీలోని ఒకరిద్దరు మాత్రమే అక్రమార్జనకు పాల్పడితే ఇప్పుడు ఒకరిద్దరు తప్ప మిగిలిన వారంతా అందిన కాడికి నొల్లుకుంటున్నారట! ఇందులో ఏమాత్రం నిజముందో వచ్చేవారం వరకు ఆగాల్సిందే!! సభ్యులను నిలువునా మోసం చేస్తున్న వి.జె.ఎఫ్. పాలకుల బండారాన్ని బట్టబయలు చేయడంలో ముఖ్యోద్దేశం మీకు తెలిసిందే.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి।

విజయవాడలో రౌడీ జర్నలిస్టులు!

విజయవాడ: ఈ నగరం రౌడీలకు నిలయమనేది మనవాళ్లందరికీ తెలిసిందే। కానీ, ఇక్కడ పనిచేస్తున్న ఇద్దరు విలేఖర్లు కూడా రౌడీలుగా ప్రవర్తిస్తూ మండల విలేఖరులను దోచుకుంటున్న వైనమిది. వీళ్లిద్దరూ పేరుకే పెద్ద పత్రికల స్టాఫ్ రిపోర్టర్లు కానీ, ప్రవర్తన తీరు మాత్రం వీధి రౌడీలను తలపిస్తోంది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి।

ఆంధ్రభూమి సబ్ ఎడిటర్ లైంగిక వేధింపులు!

హైదరాబాద్: తోటి ఉద్యోగిని అని కూడా చూడకుండా ఆ ప్రబుద్దుడు ప్రవర్తిస్తూ వృత్తిని అపహాస్యం చేస్తున్న ఆంధ్రభూమి సబ్ ఎడిటర్ లైంగిక వేధింపులపై స్పెషల్ రిపోర్ట్.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి।

ఎ.ఎన్.ఎం.ని గర్భవతిని చేసిన ఆంధ్రప్రభ విలేఖరి

విజయనగరం: జిల్లాలోని పార్వతీపురం డివిజన్లో పనిచేస్తున్న ఆరోగ్య కార్యకర్త (ఎ.ఎన్.ఎం.)ను తన మాయ మాటలతో లొంగదీసుకుని చివరకు గర్భవతిని చేసిన ఆంధ్రప్రభ విలేఖరి దురాగతం ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఏడాదిలో మూడు అబార్షన్లు చేయించిన పోటుగాడి ఉదంతంపై ప్రత్యేక కథనం.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

శ్రీకాకుళం ఆంధ్రభూమి విలేఖరి అక్రమార్జన!

శ్రీకాకుళం: జిల్లా కేంద్రంలో ఆంధ్రభూమి విలేఖరిగా పనిచేస్తున్న శ్రీనివాసరావు అవినీతి, అక్రమార్జనపై సంపూర్ణ సమాచారం, సమగ్ర ఆధారాలతో వచ్చే వారం ప్రత్యేక కథనం.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.