వరంగల్ "వార్త" విలేఖరి అవినీతి బాగోతంపై ఇటీవలి కాలంలో అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఈమధ్య వీడు రాసిన ఒక వార్తను చూపించి జిల్లా స్ఠాయి రాజకీయ నాయకుని వద్ద నుంచి ఇరవై వేల రూపాయలు గుంజుకున్న వైనం వెలుగు చూడ్డంతో ఈ ప్రముఖ పాత్రికేయుని చరిత్ర బయటపడింది. రెండు నెలల క్రితం ఇతగాడు వరంగల్ నగర కాంగ్రెస్ పార్టీ నాయకున్ని బెదిరించి పాతిక వేలు తీసుకున్న విషయం కూడా వెలుగులోకి రావడంతో ఆయన గారికి ఏం చేయాలో పాలుపోవడం లేదట!
గతంలో కూడా ఈయనపై పలు ఆరోపణలు వచ్చినా యాజమాన్యం పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడు కూడా ఆయనపై చర్యలు తీసుకోవాలన్నది కాదు విషయం, ఆయన వల్ల ఎంత మంది ఇబ్బందులు పడుతున్నారన్నది గమనించాల్సి ఉంది. ఇతగాడి సంపాదన పిచ్చి ఎంతమందిని బలిచేస్తుందన్నది ఒక సారి పరిశీలించాల్సిన బాధ్యత యాజమాన్యంపై లేదా? అన్న అనుమానాలు వ్యాప్తి చెందక ముందే యాజమాన్యం అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే మేలని తోటి మిత్రుల అభిప్రాయం.
Friday, August 1, 2008
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment