Wednesday, August 6, 2008

విశాఖ ఏజెన్సీలో స్మగ్లర్లకు "వార్త" విలేఖరి అండ

నర్సీపట్నం కేంద్రంగా పనిచేస్తున్న "వార్త" విలేఖరిపై అవినీతి ఆరోపణలు గుప్పుమంటున్నాయి. జర్నలిజం ముసుగులో ఎర్నలిజానికి అలవాటుపడిన వీడి భాగోతం ఇటీవల ఏజెన్సీలో చర్చనీయాంశంగా మారింది. స్మగ్లర్లకు అండగా నిలుస్తూ లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వీడిపై ఇప్పటికే నాలుగైదు ఫిర్యాదులు "వార్త" కార్యాలయానికి వెళ్లినప్పటికీ వాటి గురించి పట్టించుకున్నవాడు లేకుండాపోయాడట. వీడి అవినీతిలో భాగం పంచుకుంటున్నట్టు కొంతమందిపై విమర్శలు కూడా వచ్చాయి. గత నెల చింతపల్లి నుంచి నర్సీపట్నం మీదుగా తరలిపోయిన సుమారు అర కోటి విలువైన గంజాయిని ఎక్సైజ్ కళ్లుగప్పి ఉంచేందుకు వీడు ఏకంగా ఐదు లక్షల రూపాయలు తీసుకున్న విషయం ప్రస్తుతం విశాఖ ఏజెన్సీలో హాట్ టాఫిక్ గా మారింది. గతంలో కూడా వీడిపై ఇదే తరహా ఆరోపణలు వచ్చిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. జర్నలిస్టుల సంఘం నాయకునిగా వీడు పాల్పడుతున్న అక్రమాలకు ఇక అడ్డేలేదు. జర్నలిజం ముసుగులోనే తన సొంత వ్యాపారాన్ని కూడా చాపకింద నీరులా అభివృద్ధి చేసుకుంటూ వస్తున్న వీడిపై స్థానిక ఎమ్మెల్యే దగ్గర నుండి గ్రామ స్థాయి ప్రజాప్రతినిధి వరకూ ఏ ఒక్కరికీ విశ్వాసం లేదు. లోకల్ ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు నుండి ఎమ్మెల్యే కోటాలో అందరు జర్నలిస్టుల కంటే రెండిళ్లు ఎక్కువ తీసుకున్న రోజే వీడిపై తోటి జర్నలిస్టుల్లో విలువ తగ్గిపోయిందట. ప్రతీ చిన్న అవసరానికీ మండల, డివిజనల్ స్థాయి అధికారులపై వాలిపోయే వీడిలాంటి వాళ్లు సమాజానికి చీడపురుగులే!

No comments: