Wednesday, September 12, 2007

వైఎస్సార్ బహిరంగ లేఖ!

భాగ్యనగరం లో బాంబులు వేశారు. పంజాగుట్ట లో ఫ్లైఓవర్ కూలింది…అయితే ఎంటంట? ఆకాశమేమైనా ఊడిపడిందా... ప్రపంచంలో ప్రతి చోటా జరుగుతున్నయే కదా? ఆ రెండు పత్రికలకు పనేమిలేక ఏదో పెద్దవిషయం అన్నట్లు హెడ్డింగులు పెట్టి రాస్తున్నాయి.అన్నిటికి నాదే భాద్యత అన్నట్లు రాస్తారేంటి? ముఖ్యమంత్రిగా నాకు ఎన్నో పనులు ఉంటాయ్.

* మా అబ్బాయి పెట్టబోయే పేపర్,టివి చానల్ కి అన్ని సహాయాలు అందించాలా…
* మా వాడు పెడుతున్న సిమెంటు ఫాక్టరికి అన్ని సదుపాయాలు, భూమి సమకూర్చాలా…
* మా తమ్ముడు అక్రమ కట్టడాలు అన్ని క్రమబద్దం చెయ్యాలా…
* నా గాలి స్నేహితుడికి గనులన్ని లీజుకి ఇచ్చి అక్రమ తవ్వకాలు చేయించాలా…
* వాడు పెట్టబోయే గాలి (స్టీలు) ఫ్యాక్టరీకి అన్ని వసతులు ఆఘమేగాల మీద ఇప్పించాలా…
* మా తోడల్లుడు కి ప్రోజెక్టులు కేటాయించాలా…
* నా బామ్మర్ది కడప ని దోచుకోవటానికి, ఏలూరు లో రైతులని బెదిరించి పొలాలు ఆక్రమిచుకోవటానికి
సహాయం చెయ్యాలా…
* ఆ రెండు పత్రికలని మూయించాలా…
* రామోజీని సర్వనాశనం చేయాలా…
* నా ధనయజ్ఞం పూర్తికావటానికి ఇంకెన్ని ప్రొజెక్టులు కూల్చాలో అలోచించాలా…
* జైళ్ళల్లో ఉన్న మా పార్టీ హంతకులకి, గూండాలకి క్షమాబిక్ష పెట్టాలా…
* ఇడుపులపాయ ఎస్టేటు కి అన్ని సదుపాయాలు కల్పించాలా, విలువ పెగటానికి చుట్టుపక్కల గవర్నమెంటు
సొమ్ముతో చుట్టుపక్కల ప్రోజక్టులు కట్టాలా…
* నా అసైండు భూములను కాపాడుకోవాలా ( నేను ప్రభుత్వానికి ఇచ్చేసినా, నా మీద అభిమానంతో ఆ భూములు
ఎవ్వరూ తీసుకోలెదు కదా, మళ్ళీ నేనే అన్ని భూములు సాగుచేసుకోవాలా…)
* వట్టి ఆక్రమించిన అసైండు భూముల చేపల చెరువులు కాపాడాలా…
* నా బంగారు సత్తిబాబు ఉత్తరాంధ్రాని ఆక్రమించుకోవటానికి, ఓల్స్ వాగన్ డబ్బులు దొ..టానికి నా సహాయం
చెయాలా…
* ఏదో మా సూరీడు ముచ్చట పడిన డీపెప్,మరి కొన్ని బయటకు రాని కుంభకోణాలన్నిటిని జాగ్రత్తగా
మూసేయ్యాలా…
* ఇంకా ‘ఇందిర, రాజీవ్’ ల పేర్లు పెట్టడానికి ఎమైనా పాకి దొడ్లు, పందుల దొడ్లు మిగిలి వున్నాయమో అని
అలోచించాలా…
* నేను, నా జనాలు ఉండటానికి, ప్రజల సొమ్ముతో ఇంకొక పెద్ద భవంతి కట్టించుకోవలా…
* నన్ను నమ్ముకున్న ఫాక్షనిస్టులందరికి రక్షణ కల్పించాలా…
* నా ధనయజ్ఞానికి సాయం చేసే కాంట్రాక్టులందరి ప్రయోజనాలు కాపాడాలా…
* మా మంత్రులు డ్రైవర్లు,నౌకర్లు పేరిట ఫాక్టరీలు పెట్టటానికి వసూలు కాని లోనులు ఇవ్వాలా…
* రైతుల భూములన్ని మా వాళ్ళకి తక్కువ ధరలకి పరిశ్రమల పేరుతో ఇప్పించాలా…
* మొత్తం ప్రభుత్వం తోనే రియల్ ఎస్టేట్ వ్యభిచారం చేయించాలా…
* చంద్రబాబుని కడిగేయాలా…

ఇంకా ఇటువంటి ఎన్నో ప్రజలకు ఉపయోగ పడే పనులలో బిజీ గా ఉంటే ఈ రోజూవారి బాంబులు, ప్రోజెక్టులు కూలటాలు లాంటి సంఘటనలకు ఎందుకంత ఆక్రొశం, ఎవరైనా ఏమి చెయ్యగలరు,మీరందరు అలవాటు పడాలి, లేదంటే అందరిని కడిగేస్తా… అయినా బాంబులతో పోయిన వాళ్ళకి “ఇందిరా బాంబుల పధకం” కింద మరియు ఫ్లైఓవర్, ప్రోజెక్టులు కూలితే పొయేవళ్ళకి “రాజీవ్ కుప్పకూలిన ప్రొజెక్టుల పధకం” కింద పరిహారం ఇస్తాము కదా ఇంకెందుకు మీ ఏడుపులు?

సదా మీ షేవ్ లో
రాజీవ్(రౌడీ)శేఖర్ రెడ్డి

(నేనుసైతం సౌజన్యంతో...)

No comments: