అముద్రితాలకు అధిక ప్రాధాన్యం!!
హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలోనే అతిపెద్ద పబ్లికేషన్ కేంద్రంగా విరాజిల్లుతున్న విశాఖపట్నంలో సమాచార శాఖ పనితీరు నానాటికీ తీసికట్టుగా మారింది. అముద్రితాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ నిత్యం వస్తున్న వాటిని అసలు పట్టించుకోని జిల్లా పౌర సంబంధాల అధికారి (డిపిఆర్ఒ) వ్యవహారశైలి సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. మీడియాను మేనేజ్ చేయడంలో ఏమాత్రం అనుభవం లేని "స్త్రీ"మతి లక్ష్మీకాంతంకు కీలకమైన విశాఖలో పనిచేస్తున్నానన్నకనీస స్ప్రుహ లేకపోవడం విచారకరమే.
ఆమె డిపిఆర్ఒగా రావడం ఎర్నలిస్టులకి అమితానందంగానే ఉన్నప్పటికీ, ముక్కుసూటిగా వెళ్లిపోయే వాళ్లను మాత్రం ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం ఇక్కడ నెలకొని ఉన్న పరిస్తితి గతంలో ఏ డిపిఆర్ఒ హయాంలోనూ కనీవినీ ఎరుగలేదని పాత్రికేయులు వాపోతున్నా, ఉన్నతాధికారులకు మాత్రం చీమకుట్టినట్లైనా ఉండకపోవడం మన విశాఖ చేసుకున్న దురద్రుష్టమే!
జర్నలిస్టులకు ద్రోహం చేస్తూ వేర్వేరు అవసరాల పేరిట పెద్ద మొత్తంలో ప్రభుత్వ నిధులను కైంకర్యం చేస్తున్న డిపిఆర్ఒ కార్యాలయం పనితీరుపై వరుస కథనాల సమాహారం వచ్చే అప్డేట్ నుంచి...
... విశాఖపట్నం నుంచి రమేష్
Saturday, September 15, 2007
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
డియర్ సర్,
విశాఖ డిపిఆర్ఒ ఆఫీసు అక్రమాలపై మీకు కొన్ని ఆధారాలు మీ ఇ-మెయిల్ కు పంపిస్తున్నాను. వాటిలో నిజానిజాలను పరిశీలించి తోటి పాత్రికేయులకు సమాచార శాఖ నిర్వాకాన్ని తెలియజేస్తారని కోరుకుంటున్నాను.
-ఎస్కే
Sir, Very good.
xlent news for media people
Raghuram
Post a Comment