Wednesday, August 20, 2008

విలేఖరులొస్తున్నారు... హాస్టల్ వార్డెన్లూ జాగ్రత్త!

అదేమిటో తెలియదు కానీ, శ్రీకాకుళం జిల్లాలో హాస్టల్ వార్డెన్లు విలేఖరులను చూస్తే భయపడి చస్తున్నారు. ఏమైందని ఎవర్ని ప్రశ్నించినా ఒకటే సమాధానం! ఏజెన్సీ సరిహద్దు గ్రామాలపై ఏనుగుల గుంపు దాడి జరిపినట్టు తమపై విలేఖరుల దండు వచ్చిపడుతోందంటూ వార్డెన్లు, హాస్టల్ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ జిల్లాలో విలేఖరుల ఆగడాలు పెచ్చుమీరిపోయాయి. ప్రపంచంలో ఉన్న అన్ని పత్రికలకూ ఇక్కడ రిపోర్టర్లు ఉన్నట్టే వసూళ్లలో కూడా వీళ్లు తమదే పైచేయి అనిపించుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. వారం రోజుల క్రితం ఉత్తరాంధ్రలోని ఒక జిల్లాకు చెందిన ఇద్దరు జర్నలిస్టులు పదిహేను పత్రికల జాబితాతో శ్రీకాకుళం డివిజన్ పరిధిలో పనిచేస్తున్న రెవెన్యూ అధికారి నుంచి పదిహేను వేల రూపాయలు స్వాహా చేశారు. మరోపక్క ఏలూరు పత్రికల వాళ్లు తమ నలభై మంది జాబితాతో ఎలాగూ హాస్టల్ వార్డెన్లను బెదిరించి డబ్బులు చేసుకుంటున్నారు. పత్రికా రంగంలో ఇరవయ్యేళ్ల సీనియర్నని గొప్పలు చేప్పుకునే బ్రాహ్మణ జర్నలిస్టొకడు ఈమధ్య "ఎన్కౌంటర్" ప్రతినిధినంటూ బాహాటంగా వసూళ్లకు పాల్పడుతున్నాడు. కక్షకొలదీ వీడు ఎవడిపైన పడితే వాడిపైన లేనిపోని రాతలు రాసి బ్లాక్ మెయిల్ చేస్తుంటాడని తెలియక ఆ పత్రిక యాజమాన్యం ఆయా చెత్త రాతలను ప్రచురిస్తూ ప్రోత్సహిస్తోంది. ఆమదాలవలస ఎమ్మెల్యే బి.సత్యవతిపై గత సంచికలో వీడు రాసిన రాతలను పరిశీలిస్తే వాడు ఎలాంటి వాడో తెలుస్తుంది. ఏకంగా పాతిక వేల రూపాయలు డిమాండ్ చేసిన వీడి ప్రయత్నం ఫలించలేదని అబద్దపు రాతలు రాసి తన దిర్బుద్దిని చాటుకున్నాడు. చివరికి అడగకుండానే అవసరమైనప్పుడల్లా డబ్బులు ఇచ్చి ఆదుకుంటున్న జిల్లా మంత్రి ధర్మాన ప్రసాదరావుపై తప్పుడు రాతలు రాసి మంత్రి ప్రత్యర్ధులైన టెక్కలి, పలాస ప్రాంతాలకు చెందిన ఇద్దరు నాయకుల వద్ద పది వేల రూపాయలు తీసుకున్నాడు.
(మరిన్ని వివరాలు వచ్చే అప్డేట్లో...)

No comments: