Friday, August 1, 2008

"టివి-9" పేరిట వర్తకులకు వేధింపులు

తిరుమలేశుని సన్నిధిలో "టివి-9" పేరిట వర్తకులకు వేధింపులు ఎక్కువయ్యాయి. ఇలాంటి ఆరోపణలు గతంలో అన్ని మీడియా సంస్ధల ప్రతినిధులపైనా వచ్చినప్పటికీ, ఈమధ్య కాలంలో ప్రత్యేకించి ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులపై, అందునా "టివి-9" ప్రతినిధులపై ఎక్కువగా వస్తుండడం గమనార్హం.

దీని వెనుక ఏదో కుట్ర జరుగుతుందని ఆ సంస్ధ యాజమాన్యం అనవచ్చేమో కానీ ఇందులో ఎలాంటి విమర్శలకూ తావులేదు. దీనికి నిదర్శనం ఈ ఆదివారం జరిగిన సంఘటనే! తిరుమల కొండపై హోల్సేల్ వ్యాపారం చేస్తూ పెద్ద మొత్తంలో ఆర్జిస్తున్న తమిళనాడుకు చెందిన వర్తకున్ని బ్లాక్ మెయిల్ చేసి యాభై వేల రూపాయలు డిమాండ్ చేసిన విషయం "టివి-9" యాజమాన్యం ద్రుష్టికి వచ్చిందో లేదో కానీ తిరుమల, తిరుపతంతా ఈ విషయం గుప్పుమంది. దీంతో ఎన్నాళ్లగానో సాగుతున్న మీడియా లంచాల బాగోతం మరోమారు బయటపడినట్లైంది.

No comments: