విశాఖ సమాచారం, ఈనాడు, వార్త, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ పత్రికల విలేఖరులు కలెక్టరేట్లోకి అడుగుపెట్టారంటే అన్ని సెక్షన్ల అధికారులూ అప్రమత్తమవుతుంటారు. పొరపాటున కలెక్టరో, జాయింట్ కలెక్టరో అటువైపుగా వస్తున్నారన్నా పెద్దగా స్పందించని సిబ్బంది, సెక్షన్ అధికారులూ ఈ కలం వీరులు వస్తున్నారంటే మాత్రం ఉలిక్కిపడుతూంటారు. ఎందుకంటే, వీళ్లకీ డిఆర్వోకీ మధ్య ఉన్న సంబంధాలు అలాంటివి మరి. కలెక్టరేట్లో ఈ మీడియా మొనగాళ్ల హవా తగ్గించాలని ఉద్యోగులు ఏంత కోరినా ఇన్ఛార్జి పెద్దలు ఖాతరు చేయకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటో అంతుచిక్కడం లేదు.
వీళ్లు కలెక్టరేట్లో గడుపుతున్న సమయంలో అధిక భాగం వార్తల సేకరణ కంటే సొంత పైరవీలకే వెచ్చిస్తున్నారనడంలో అతిశయోక్తిలేదు. ఈ మాట తోటి విలేఖరులే అంగీకరిస్తారు.
డిఆర్వో చేతిలో కీలుబొమ్మలుగా మారిన విలేఖరుల గురించి గతంలో ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోని యాజమాన్యాలు ఇప్పటికైనా దృష్టిపెడితే మంచిది. లేదంటే, వాళ్ల అక్రమాలకు పెద్దల తోడ్పాటుకూడా ఉందని బయటి ప్రపంచం సైతం ఊహించుకునే ప్రమాదం లేకపోలేదు.
Tuesday, October 2, 2007
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment